పెద్దవడుగూరు మండలంలోని గేట్స్ కళాశాలలో ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు జరిగిన రీసెంట్ అడ్వాన్స్ ఇన్ నావెల్ డ్రగ్ డెలివరీ అనే అంశంపై జాతీయ స్థాయిఆన్ లైన్ ప్రోగ్రాం శనివారం ముగిసింది. దక్షిణ కొరియా పుసాన్ యూనివర్సిటీ పాలిమర్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఈల్డో చుంగ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పాలిమర్ డ్రగ్ డెలివరీ అనే నూతన విధానం ద్వారా క్యాన్సర్ టిష్యూలపై సమగ్ర చికిత్స చేయవచ్చున్నారు.