పెద్దవడుగూరు మండలం చింతలచేరువుకు చెందిన రామాంజనేయులు(49)పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతుడి భార్య అనారోగ్యపరిస్థితులతో మంచానపడటం, ఉన్న ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి అప్పులవ్వడంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.