పెద్దవడుగూరు మండల కేంద్రంలోని శ్రీసరస్వతి హై స్కూల్ విద్యార్థులు అఖిల్ కుమార్, వర్షిత, అభిలాష్, లక్ష్మీప్రియాలు షైనింగ్ స్టార్ అవార్డుకి ఎంపికయ్యారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే పరిటాల సునీత, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు చేతుల మీదుగా ఈ విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని, ప్రశంసా పత్రాన్ని అందించారు. అవార్డు సాధించిన విద్యార్థులను కరెస్పాండెంట్ మారుతి ప్రసాద్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.