తాడిపత్రి రూరల్ పరిధిలోని గన్నె వారి పల్లి కాలనీలోని ఓ నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి ఆయన సిబ్బంది వ్యభిచార గృహం పై దాడి చేసినట్లు ఆదివారం సీఐ తెలిపారు. దాడుల్లో ఇద్దరు మహిళలతో పాటు నలుగురు విట్టులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.