అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తక్కల్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీనరసమ్మ గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. తాడిపత్రి మండల పరిధిలోని చల్లవారిపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడడంతో బైక్పై వెళ్తున్న తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం కుమార్తె లక్ష్మీనరసమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.