యాడికి రూరల్ సర్కిల్ సీఐగా రామసుబ్బయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గుంతకల్లు నుంచి బదిలీపై వచ్చానన్నారు. పెద్దవడుగూరు మండలాల్లోని ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో జరిగిన కక్షలను మనసుల్లో పెట్టుకుని గ్రామాల్లో గొడవలకు పాల్పడితే సహించబోమన్నారు.