వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా జగన్ తనను ఆప్యాయంగా పలకరించి ఎన్నికల అనంతరం తాడిపత్రిలో చోటు చేసుకున్న పరిణామాలు, నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల పరిస్థితి పై ఆరా తీసినట్లు రమేష్ రెడ్డి తెలిపారు.