చాగల్లు రిజర్వాయర్ నుండి పెన్నానదికి నీటి విడుదల

51చూసినవారు
చాగల్లు రిజర్వాయర్ నుండి పెన్నానదికి నీటి విడుదల
పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్ నుండి పెన్నానదిలోకి నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు బుధవారం తెలిపారు. చాగల్లు రిజర్వాయర్ ఎగువ ప్రాంతం పామిడి తదితర ప్రాంతాల నుండి నీరు రానున్న నేపథ్యంలో ముందస్తుగా చాగల్లు రిజర్వాయర్ ఒక గేటు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని దిగువ పెన్నానదికి విడుదల చేశారు. దీంతో పెన్నానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్