జిల్లా స్థాయి యోగా క్రీడా పోటీల్లో తాడిపత్రి కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ పేర్కొన్నారు. అనంతపురంలోని అశోక్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అండర్-14 యోగా విభాగంలో భార్గవి, అండర్-17 విభాగంలో రుమానా, కౌసర్ జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఎంపికైన విద్యార్థులను ఎస్ఓ మునెమ్మ, పీఈటీ చంద్రకళలు అభినందించారు.