రాళ్లదాడి ఘటనలో మరో ఏడుగురు వైసీపీ నాయకుల అరెస్టు

62చూసినవారు
రాళ్లదాడి ఘటనలో మరో ఏడుగురు వైసీపీ నాయకుల అరెస్టు
తాడిపత్రిలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన రాళ్లదాడి ఘటనలో మరో ఏడుగురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గుంతకల్లులోని కోర్టు ఎదుట హాజరు పరిచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్