తాడిపత్రి పట్టణంలో పోలీసులు బుధవారం విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. తాడిపత్రి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి, సిఐ సాయి ప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్సై గౌస్ బాషా తన సిబ్బందితో కలిసి అశోక్ పిల్లర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రూల్స్ పాటించని పలు వాహనాలకు జరిమానాలు విధించారు.