న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4 తేదీల్లో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి సాయి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రిలోని బాలాజీ ఫంక్షన్ హాలులో నిర్వహించే ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు చెందిన 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.