తాడిపత్రి మండలంలోని బొందలదిన్నె గ్రామంలో కర్ణాటకకు చెందిన 15మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, నిందితుడు రామయ్యను అరెస్టు చేశామని అప్ గ్రేడ్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.