బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ఐదు మందిపై కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ ఎస్సై గౌస్ బాషా బుధవారం తెలిపారు. తాడిపత్రి పట్టణంలోని పలు ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై ఎస్సై గౌస్ బాషా తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా ఐదు మంది పట్టుబడినట్లు పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.