తాడిపత్రి మండలం ఆలూరు కోనలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 6 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. 6న అంకురార్పణ, ధ్వజారోహణం, 7న సింహవాహన సేవ, 8న శేషవాహన సేవ, 9న హనుమద్వాహన సేవ, 10న గరుడవాహన సేవ, 11న గజవాహన సేవ, 12న కళ్యాణోత్సవం, రథోత్సవం, 13న అశ్వవాహన సేవ, పార్వేట ఉత్సవం, 14న తీర్థవాది, తదితర కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.