తాడిపత్రి పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మూడోరోజు ఫైర్ ఆఫీసర్ మోహన్ బాబు ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని గోకుల్ అపార్ట్మెంట్, సంజీవ్ నగర్ తోపాటు పట్టణంలోని అపార్ట్మెంట్లలో నివసించే వారికి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. గృహిణిలకు ఎల్పిజి గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ఆర్పాలి అన్నదానిపై గృహినీలకు డెమో ద్వారా అవగాహన కల్పించారు.