తాడిపత్రి: హెల్మెట్ ఉపయోగంపై బైక్ ర్యాలీ

60చూసినవారు
తాడిపత్రి: హెల్మెట్ ఉపయోగంపై బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు హెల్మెట్ వాడకంపై సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపి ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ల ఉపయోగంపై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లను ఉపయోగించాలని బ్యానర్ల ద్వారా వివరించారు.

సంబంధిత పోస్ట్