తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఈ నెల 11వ తేదీన చిన్న గౌసుల్లా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆదివారం మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సాయిప్రసాద్ తెలిపారు. ఇప్పటికే రఫీ, జిలాన్, హాజీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రషీద్, ఇంతియాజ్, రబ్బాని, మరో వ్యక్తి కూడా చిన్న గౌసుల్లా ఆత్మహత్యకు కారకులని కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.