ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు. తాడిపత్రి స్థానిక అర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి నాయకులు ప్రస్తుతం ట్రూ ఆఫ్, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపారని ధ్వజమెత్తారు.