తాడిపత్రిలో ఎక్కువశాతం ప్రజలు గ్రానైట్, నల్ల బండల పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వాటికి భారీగా విద్యుత్తు ఛార్జీలు ఉండటంతో ఎక్కువగా మూత వేసుకుంటున్నారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తాడిపత్రి ప్రాంతంలో ఉన్న గ్రానైట్, నల్ల బండల పరిశ్రమలకు విద్యుత్తు ఛార్జీలు తగ్గించుందుకు కృషి చేయాలని జేసీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని కోరారు.