తాడిపత్రి మండలం తాతగారిపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ దుర్మరణం చెందారు. కూలీ పనులు చేసుకుంటున్న సమయంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ ట్రాక్టర్ ను అజాగ్రత్తగా నడపడం వల్లే ఆమె మృతి చెందినట్లు సీఐ శివ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.