అనంతపురంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బుధవారం పర్యటించారు. పట్టణంలోని ఎంవైఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అనంత హార్టికల్చర్ కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడిపత్రి ప్రాంతంలోని హార్టికల్చర్ పంటల గురించి ప్రభాకర్ రెడ్డి వివరించారు. తాడిపత్రి ప్రాంతం నుంచి ఇప్పటికే అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, రైతులకు ప్రోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.