తాడిపత్రి పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్డు సర్కిల్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న పరమ శివుని విగ్రహ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. విగ్రహ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.