తాడిపత్రి నియోజకవర్గంలో పలు సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. పెద్దవడుగురు మండలంలో రెండు నెలలుగా ఇండియన్ గ్యాస్ పంపిణీ జరగడంలేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్యాస్ పంపిణీలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం లోపు కేసు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగుతామన్నారు.