తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరు కోనలో వెలసిన శ్రీ భూదేవి సమేత శేష తల్ప రంగనాథ స్వామికి శనివారం రోజున విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నంద వేకువజాము నుంచి పంచామృతాభిషేకం నిర్వహించి వివిధ పూలమాలలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, భక్తాదులు అన్నప్రసాద వినియోగించుకోవాల్సిందిగా కోరారు.