తాడిపత్రి: విద్యార్థినికి లాప్ టాప్ వితరణ

51చూసినవారు
తాడిపత్రి: విద్యార్థినికి లాప్ టాప్ వితరణ
తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న మంజుల విజయ శ్రీకి బుధవారం రోటరీ క్లబ్ సభ్యులు లాప్ టాప్ వితరణ ఇచ్చారు. తాడిపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థిని చదువు నిమిత్తము లాప్ టాప్ అందించామని క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రఫీ, సభ్యులు జోసెఫ్ రెడ్డి, బాలసుబ్రమణ్యం, సంజన, ఇస్మాయిల్, నవీన్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్