తాడిపత్రి: గంగమ్మ జాతర వైభవంగా నిర్వహిద్దాం

తాడిపత్రి మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద వేలసిన గంగమ్మతల్లి జాతరను వైభవంగా నిర్వహిద్దామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో రానున్న ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో జరిగే పనులను ఆయన గురువారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.