తాడిపత్రిలోని రైల్వే వంతెన సమీపంలో అనంతపురం వెళ్లే రింగ్ రోడ్డులో 20 అడుగుల శివుని విగ్రహం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విగ్రహ ఏర్పాట్లను బుధవారం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. విగ్రహ ఏర్పాటను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెంట తెదేపా నాయకుడు ఎస్పీ రవీంద్రారెడ్డి ఉన్నారు.