పెద్దపప్పూరు మండలం పెద్ద యక్కలూరులో మండల వైద్యాధికారి లోకేశ్ కుమార్ బుధవారం పర్యటించారు. గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్ 104 కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎన్ సి డి, సి డి సర్వేను తనిఖీ చేశారు. ఇప్పటివరకు 33శాతం సర్వే పూర్తి అయినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పరీక్షలు చేసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.