తాడిపత్రి పట్టణం, పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆటోలను ఎంవీఐ, పోలీసులు అధికారులు బుధవారం తనిఖీ చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, వాహన పత్రాలు సరిగా లేకపోవడంతో వంటి కారణాలతో సుమారు 40 వాహనాలను జప్తు చేసి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి తరలించారు. వాహన యజమానులపై కేసులు నమోదు చేశారు.