తాడిపత్రి: ముగిసిన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

84చూసినవారు
తాడిపత్రి: ముగిసిన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
తాడిపత్రి మండలంలోని ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు సోమవారం స్వామి వారికి కోనలో తీర్థవారి, వసంతోత్సవం, చక్రస్నానం వంటి కార్యక్రమాలు ఆర్చకులు జరిపించారు. అనంతరం స్వామి వారికి పుష్పయాగ కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్