తాడిపత్రి: ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు

65చూసినవారు
తాడిపత్రి: ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు
తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ 5వ రోడ్డులో వెలసిన శ్రీశివసాయిమందిరంలో శుక్రవారం సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీవరసిద్ధి వినాయకునికి అర్చకులు మారుతిప్రసాద్ శర్మ అభిషేకాలు నిర్వహించారు. అలాగే అర్చనలు, తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్