వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకూడదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. వారం క్రితం విదేశాలకు వెళ్లిన ఎమ్మెల్యేకు యాడికి మండలం నాయకులు ఫోన్ చేసి కొన్ని గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. స్పందించిన ఆయన శుక్రవారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మున్సిపల్, పంచాయతీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్య రాకూడదని సూచించారు.