తాడిపత్రి పట్టణంలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి వివిధ పూలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు.