తాడిపత్రి ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పుట్లూరు రోడ్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రహదారులు, పారిశుద్ధ్యం సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.