ఆలయ ఆవరణలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని సంజీవ్నగర్ 5వ రోడ్డులోని శ్రీ శివసాయి మందిరాన్ని గురువారం దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో పచ్చదనం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. త్వరలో పనులను హైదరాబాదుకు చెందిన ఓ ప్రముఖ కంపెనీతో చేయించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట తెదేపా నాయకుడు ఎస్.వి. రవీంద్రారెడ్డి ఉన్నారు.