తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత

53చూసినవారు
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత
తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు శనివారం ఉదయం బయలుదేరగా, యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు అనుమతులు ఉన్నా అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన వస్తారన్న వార్తతో టీడీపీ శ్రేణులు జేసీ ఇంటివద్ద చేరారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్