తాడిపత్రి ని పరిశ్రమల హబ్ గా మార్చడమే లక్ష్యం

59చూసినవారు
తాడిపత్రి ని పరిశ్రమల హబ్ గా మార్చడమే లక్ష్యం
తాడిపత్రి ప్రాంతాన్ని ఇండస్ట్రీయల్ హబ్ గా మార్చి ప్రజలకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో శనివారం ఆయన ఏపీఐఐసీ అధికారులతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో తాడిపత్రిలోని అనేక రకాల పరిశ్రమలు మూత పడటంతో వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారని తెలిపారు. మూత పడిన పరిశ్రమలతో పాటు కొత్తవాటిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్