ఏపీ అభివృద్ధికి దిక్సూచి సీఎం చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. యాడికిలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది విజయాలను వివరించారు. ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుతామని తెలిపారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యకర్తలు, నేతలు ఆయన వెంట ఉన్నారు.