పెద్దపప్పూరు మండలం చిన్నఎక్కలూరులో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కంబన్న వద్ద ఉన్న 87 గొర్రెల్లో 67 గొర్రెలు అకస్మాత్తుగా మృతి చెందాయి. దీంతో బాధిత కాపరి కన్నీటి పర్యంతమయ్యాడు. సంఘటనపై పశువైద్యాధికారి సుబ్బారెడ్డి పరిశీలించి, పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.