శాకంబరీదేవిగా వాసవీవాత

72చూసినవారు
శాకంబరీదేవిగా వాసవీవాత
యాడికి మండల కేంద్రంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, గంగా జలాలతో అభిషేకం, పంచామృత అభిషేకం, కుంకుమార్చన లలిత సహస్రనామావళి పఠించారు. అనంతరం 21 మంది దంపతులచే సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్