ఓ విద్యార్థిని అదృశ్యంపై ఆదివారం యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. యాడికిలోని ఓ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని కుట్టు మిషన్ నేర్చుకోవడానికి అంటూ బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా ఆచూకీ కానరాలేదు. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.