బాల్య వివాహాల నివారణపై గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హెల్త్ ఎడుకేటర్ విజయ భాస్కర్ పేర్కొన్నారు. మండలంలోని వేములపాడు వద్ద ఉన్న కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వివాహ వయసు ఆడ పిల్లలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు ఉండాలన్నానానరు. బాల్య వివాహలు చేయడం వల్ల కలిగే నష్టాలతో పాటు చట్టపరంగా తీసుకునే చర్యల గురించి వివరించారు.