యాడికి మండలం గుడిపాడులోని ఓ సిమెంట్ పరిశ్రమలో ఓ ఉద్యోగి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. గుడిపాడు గ్రామానికి చెందిన సూర్యుడు (43) పరిశ్రమలోని ప్రాసెస్ యూనిట్లో పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఒక్కసారిగా కుప్పకూలి కూర్చిలోనే పడిపోయాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంటనే పరిశ్రమలోని హెచ్ఆర్కు సమాచారం అందించారు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు