యాడికిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్నొన్నారు. స్థానిక జేసీ నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా చెన్నకేశవుని ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.