యాడికి మండల కేంద్రంలో బుధవారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ కాలువలను బుధవారం పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వాటర్ ట్యాంకులు సరిపడినన్ని లేకపోవడంతో తాగునీటి కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే స్పందించారు. వాటర్ ట్యాంకులను, డ్రైనేజీలను పరిశీలించారు.