యాడికి మండలం కుర్మాజీపేటకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు శనివారం రాత్రి ఎస్ఐ రమణ కేసు నమోదు చేశారు. గత నెల 27న రామాంజనేయులు రాయల చెరువు గ్రామానికి బ్యాంకు పని నిమిత్తం వెళ్లారు. తిరిగి రాలేదు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన భార్య గౌతమి ఫిర్యాదు చేశారు' అని ఎస్ఐ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.