కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని అనంతపురం జిల్లా యాడికి పోలీసులు సకాలంలో స్పందించి ఆదివారం కాపాడారు. స్థానికుల వివరాల మేరకు యాడికికి చెందిన గంజి శేఖర్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు భార్య సౌమ్యకు వీడియో పంపాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వీరన్న టెక్నాలజీని ఉపయోగించి ఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్య చేసుకోబోయిన గంజి శేఖర్ ను కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.