ఓ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. యాడికి మండలం రాయలచెరువు జాతీయ రహదారి పక్కన ఓ రైతు బీడు పొలంలో 270 బియ్యం బస్తాలను నిల్వ ఉంచారు. సమాచారం అంద డంతోఅందడంతో వాటిని పరిశీలించగా రేషన్ బియ్యంగా గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని గోదాముకు తరలించారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయను న్నట్లుచేయనున్నట్లు సీఐ ఈరన్న తెలిపారు.