యల్లనూరు మండలంలోని వెన్నపూసపల్లి సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రవీంద్ర శుక్రవారం ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. సబ్ స్టేషన్ పరిధిలోని వెన్నపూసపల్లి, కోడిమూర్తి, గడ్డంవారిపల్లి, దుగ్గుపల్లి గ్రామాల్లో సరఫరా నిలిపివేయనున్నామని, ఆయా గ్రామాల ప్రజలు గమనించాలని కోరారు.